దేశంలో ఒక్కరోజే  63,371 మందికి కరోనా.. 895 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో ఒక్కరోజే  63,371 మందికి కరోనా.. 895 మంది మృతి

October 16, 2020

nnvnfg

భారత్ కరోనా కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే గత వారం క్రితానికి ఇప్పటికి కొంత మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 63,371 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది.  895 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.  10,28,622 శాంపిళ్లను పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న 81,541 డిశ్చార్జీలు అయ్యాయి. 

దేశంలో ఇప్పటి వరకు 73,70,469 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,12,161 బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 64,53,780 మంది బాధితులు కోలుకోగా.. ఇంకా 8,04,528 మంది చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో అత్యధికులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9,22,54,927 కరోనా పరీక్షలు చేశారు. రికవరీ రేటు 87.56 శాతంగా ఉంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 39,175,466 పాజిటివ్ కేసులను గుర్తించారు 1,102,941 మరణాలు సంభవించాయి. 29,378,743 మంది బాధితులు కోలుకోగా.. ఇంకా 8,693,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.