భారత్‌లో తగ్గని కరోనా.. 74,32,681 మందికి పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో తగ్గని కరోనా.. 74,32,681 మందికి పాజిటివ్

October 17, 2020

October 17

భారత్‌లో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేలాది మంది ప్రజలు వ్యాధిబారిన పడుతూనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,212 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9,99,090 శాంపిళ్లను పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.  837 మంది బాధితులు చనిపోయారు. 70,816 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీ రేటు 87.56 శాతంగా ఉంది 

దేశవ్యాప్తంగా 74,32,681మందికి ఈ వ్యాధి సోకింది.1,12,998 మంది బాధితులు మృత్యువాతపడ్డారు.  65,24,596 మంది కోలుకోగా ఇంకా 7,95,087 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 9,32,54,017 శాంపిళ్లను పరీక్షలు చేశారు. మరోవైపు 39,586,909 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,109,130 ప్రాణాలు కోల్పోయారు. 29,658,575 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా 8,819,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి.