భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా 50 వేల లోపు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 45,149 మంది కొత్తగా వ్యాధి బారినపడ్డారు. 9,39,309 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. 480 మంది ప్రాణాలు కోల్పోయారు. 59,105 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రికవరీ రేటు 90.23కి చేరింది.
దేశవ్యాప్తంగా 79,09,960 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారిలో 1,19,014 మంది ప్రాణాలు కోల్పోయారు. 71,37,228 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు భారీగా పెరగడంతో అంతా ఊరట చెందుతున్నారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 43,345,949 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,159,093 మంది రోగులు చనిపోయారు. 31,904,900 బాధితులు కోలుకోగా..10,281,956 యాక్టివ్ కేసులు ఉన్నాయి.