భారత్‌లో కరోనా అప్‌డేట్.. ఒక్కరోజే 81,484 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా అప్‌డేట్.. ఒక్కరోజే 81,484 కేసులు

October 2, 2020

Corona Cases in India October 2nd

భారత్‌లో తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. అన్‌లాక్‌తో జనం విచ్చలవిగా మళ్లీ రోడ్లపైకి వస్తున్నారు. అదే సమయంలో కోలుకున్నవారు కూడా పెరిగిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 81,484 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 1095 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,97,947 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో రోగులు బయటపడ్డారు. 78,877 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

దేశంలో మొత్తం 63,94,069 మందికి వ్యాధి సోకింది. వీరిలో 99,773 మంది మృత్యువాతపడ్డారు. 53,52,078 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 9,42,217 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 83.70 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 7,67,17,728 మందికి వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. మహారాష్ట్ర, ఏపీలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 34,481,669 మందికి మహమ్మారి సోకింది. వీరిలో 1,027,653 మంది చనిపోయారు. 25,670,615 రికవరీలు జరిగాయి. ఇంకా 7,783,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.