దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 96,424 కేసులు  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 96,424 కేసులు 

September 18, 2020

bncgvb

భారత్‌లో కరోనా కలవరపెడుతూనే ఉంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో బాధితులను గుర్తిస్తూనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,424 మంది కరోనా సోకినవారిని గుర్తించారు.  1174 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న 10,06,615 శాంపిల్స్ పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. గురువారం ఒక్కరోజే  87,472 మంది కరోన నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 78.86గా నమోదైంది.

దేశ వ్యాప్తంగా 52,14,678 మందికి వ్యాధి సోకింది. వీరిలో 84,372 మంది చనిపోయారు.  41,12,551 మంది కోలుకోగా ఇంకా 10,17,754 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 6,15,72,343 మందికి పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదు కాగా, రెండో స్థానంలో ఏపీ, ఆ తర్వాత కర్నాటక, యూపీ ఉన్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 30,351,589 మందికి వ్యాధి సోకింది. వీరిలో 950,555  మంది చనిపోయారు. 22,041,315 మంది కోలుకోగా.. 73,59,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో భారత్ ఉంది.