దేశంలో 90 వేలకు చేరిన కరోనా మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 90 వేలకు చేరిన కరోనా మరణాలు

September 23, 2020

gngvn

దేశంలో కరోనా కల్లోలం ఏ మాత్రం ఆగడం లేదు. ఓ వైపు పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య పెరుగుతున్నా, రికవరీలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో 83,347 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.1,085 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 9,53,683 మందికి శాంపిళ్లను  పరీక్షించారు.

ఇప్పటి వరకు భారత్‌లో బాధితుల సంఖ్య 5,646,011కు చేరింది. వీరిలో 90,020 మంది చనిపోయారు. 45,87,614 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 9,68,377 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 81.23 శాతానికి చేరింది. మొత్తం దేశవ్యాప్తంగా  6,62,79,462 మంది శాంపిళ్లను పరీక్షించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 31,783,504 మందికి వైరస్ సోకింది. వీరిలో 975,471 మంది చనిపోయారు. 23,400,640 కోలుకోగా.. ఇంకా 7,407,393 యాక్టివ్ కేసులు ఉన్నాయి.