దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీలు.. నిన్న ఎన్నంటే - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీలు.. నిన్న ఎన్నంటే

September 24, 2020

glabal

దేశంలో కరోనా రికవరీలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు కోలుకుంటున్నవారు ఎక్కువగానే ఉన్నారు. గడిచిన 24 గంటల్లోనే 86 వేల మందికిపైగా బాధితులు కోలుకున్నారు.  దేశవ్యాప్తంగా 86,507 కేసులు నమోదు అయ్యాయి. 1129 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,56,569  నిర్ధారణ పరీక్షలు చేయగా ఈ స్థాయిలో బాధితులను గుర్తించారు. రికవరీ రేటు 81.55 శాతానికి చేరింది. 

ఇప్పటి వరకు 57,32,519 మందికి వ్యాధి సోకింది. వీరిలో  91,149 మంది బాధితులు చనిపోయారు. 46,74,988 మంది కోలుకున్నారు. ఇంకా 9,66,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటి వరకు దేశంలో  6,74,36,031 కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 32,097,169 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 9,81,967 మంది చనిపోయారు. 23,679,970 బాధితులు కోలుకోగా.. ఇంకా 7,435,232 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేటు పెరుగుతుండం కాస్త ఊరట కలిగించే విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.