దేశంలో 58 లక్షలు దాటిన కరోనా కేసులు  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 58 లక్షలు దాటిన కరోనా కేసులు 

September 25, 2020

nvgnjy

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు, రికవరీలు దాదాపు సమస్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 58 లక్షలకు పైగా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 86,052 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 1,141 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 14,92,409 శాంపిళ్లను పరీక్షించారు. 81,177 మంది రోగులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 81.32 శాతానికి చేరింది. 

దేశంలో ఇప్పటి వరకు  58,18,571 మంది వ్యాధి బారిన పడ్డారు.  6,89,28,440 కరోనా పరీక్షలు జరిగాయి. బాధితుల్లో 92,290 మంది చనిపోయారు. 47,56,165 మంది కోలుకోగా.. 9,70,116 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 32,416,405 మందికి వైరస్ సోకింది. వీరిలో 987,742 మంది మృత్యువాత పడ్డారు. కోలుకున్న వారి సంఖ్య  23,932,212గా ఉండగా.. 7,496,451 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో మహారాష్ట్రలో అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఏపీ నిలిచింది.