దేశంలో కరోనా.. నిన్న 93,420 డిశ్చార్జీలు, 85,362 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో కరోనా.. నిన్న 93,420 డిశ్చార్జీలు, 85,362 కేసులు

September 26, 2020

ncgn

భారత్‌లో కరోనా వ్యాప్తి ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో వ్యాధిబారిన పడుతూనే ఉన్నారు. అయితే రికవరీల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో  85,362 మందికి కొత్తగా పాజిటివ్ అని తేలింది. 1089 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 13,41,535 శాంపిళ్లను పరీక్షించారు. 93,420 మంది కోలుకున్నారు. 

దేశవ్యాప్తంగా 59,03,933 మందికి వైరస్ సోకింది. 93,379 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. బాధితుల్లో 48,49,585 మంది కోలుకోగా.. ఇంకా 9,60,969 మంది వ్యాధితో బాధపడుతున్నారు. నిన్నటి వరకు మొత్తం 7,02,69,975 కరోనా పరీక్షలు చేశారు. రికవరీ రేటు 82.14 శాతానికి చేరింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 32,765,204 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 9,93,463 మంది ప్రాణాలు కోల్పోయారు. 24,178,346 మంది ప్రాణాలు కోల్పోగా..75,93,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి.