భారత్‌లో కరోనా అప్‌డేట్ :  నిన్న 70,589 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా అప్‌డేట్ :  నిన్న 70,589 కేసులు

September 29, 2020

vfh

భారత్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 61 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో 70,589 మందికి కొత్తగా వ్యాధి సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 776 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,42,811 శాంపిళ్లను పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. సోమవారం 84,877 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 83.01గా నమోదు అయింది. 

దేశవ్యాప్తంగా 61,45,292 మంది వ్యాధి బారినపడ్డారు. వీరిలో 96,318 మంది బాధితులు చనిపోయారు. ఇప్పటివరకు 51,01,398 మంది కోలుకున్నారు. 9,47,576 చికిత్స తీసుకుంటున్నారు. మరణాల రేటు 1.84 శాతంగా ఉంది. నిన్నటి వరకు మొత్తం  7,31,10,041 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 33,552,166 మందికి వైరస్ సోకింది. వీరిలో 10,06,379 మంది చనిపోయారు. 24,880,949 రికవరీలు ఉండగా.. 76,64,838 యాక్టివ్ కేసులు ఉన్నాయి.