దేశంలో కరోనా కల్లోలం.. నిన్న ఒక్కరోజే 80,472 కేసులు  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో కరోనా కల్లోలం.. నిన్న ఒక్కరోజే 80,472 కేసులు 

September 30, 2020

nvhn b

భారత్‌లో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో బాధితులను గుర్తిస్తూనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 10,86,688 పరీక్షలు చేయగా 80,472 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 1,179 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 86,428 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 83 శాతానికి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా  62,25,764 మంది వ్యాధి బారిన పడ్డారు. వారిలో 97,497 మంది చనిపోయారు. 51,87,826 మంది కోలుకున్నారు. ఇంకా 9,40,441 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,41,96,729 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 33,844,178 మందికి వ్యాధి సోకింది.  10,12,659 మంది మృత్యువాతపడ్డారు. 25,148,403 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. ఇంకా      7,683,116 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాధి వ్యాప్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.