కరోనా కల్లోలం.. దేశంలో ఒక్కరోజే 507 మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కల్లోలం.. దేశంలో ఒక్కరోజే 507 మరణాలు 

July 1, 2020

nvnhngn

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ అదుపు కావడం లేదు. రోజు రోజుకు వేలాది కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 18,653 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,85,493కు చేరింది. 17,400 మంది వైరస్ కాటుకు బలయ్యారు. వ్యాధి సోకుతున్నా కూడా కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3,47,979 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2,20,114 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా10,528,059 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. 513,913 మంది మరణించారని వరల్డ్‌ మీటర్ తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాలో 27,27,853 కరోనావైరస్ కేసులు వచ్చాయి. 130,122 మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 1,408,485, రష్యా 647,849,భారతదేశంలో 585,792 కేసులు బయటపడ్డాయి.