తెలంగాణలో కరోనా టెర్రర్.. 1,891 కేసులు, 10 మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా టెర్రర్.. 1,891 కేసులు, 10 మరణాలు 

August 2, 2020

Corona Cases in Telangana .

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి జోరుగా కొనసాగుతోంది. రోజు రోజుకు వైరస్ బారిన చాలా మంది పడుతూనే ఉన్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లోనూ కేసులు ఎక్కువ సంఖ్యలోనే వచ్చాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,891 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. 10 మంది బాధితులు మృత్యువాత పడ్డారని తెలిపింది. 

దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 66,677కు చేరింది. 540 మంది కోవిడ్‌తో పోరాడలేక ప్రాణాలు కోల్పోయారు.అయితే రికవరీ రేటు మాత్రం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడింది.  71.3  శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 47,590  మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా కాగా నిన్న కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే  517 మందికి కొత్తగా కరోనా సోకిందని వెల్లడించారు.