తెలంగాణలో మళ్లీ పెరిగాయి.. ఒక్కరోజే 1896 మందికి పాజిటివ్  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మళ్లీ పెరిగాయి.. ఒక్కరోజే 1896 మందికి పాజిటివ్ 

August 11, 2020

Corona Cases in Telangana August 11

తెలంగాణలో కరోనా దోబూచులాడుతోంది. ఒకరోజు కేసుల సంఖ్య తగ్గినట్టుగానే కనిపించి మరో రోజు పెరుగుదలను నమోదు చేస్తోంది. ఇటీవల తక్కువగా కేసులు వచ్చాయని సంతోషించేలోపే మళ్లీ ఎక్కువగానే వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 1896 మంది కరోనా బారిన పడ్డారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1788 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.18,035 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. 

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 82,647 మందికి వ్యాధి అంటుకుంది. వీరిలో 645 మంది చనిపోయారు. అయితే 59,374 మంది కోలుకొని ఇంటికి చేరగా.. ఇంకా 22,628 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 6,42,875 మందికి టెస్టులు నిర్వహించారు. నిన్న కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా రోగులను గుర్తించారు. జీహెచ్ఎంసి పరిధిలో 338 ,రంగారెడ్డి 147, కరీంనగర్‌ 121, మేడ్చల్‌ 119గా ఉన్నాయి. కరోనా సోకిన వారిలో 84 శాతం మందికి లక్షణాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.