తెలంగాణలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే

August 14, 2020

Corona Cases in Telangana August 14

గడిచిన 24 గంటల్లో వెల్లడైన కరోనా బాధితుల సంఖ్యను తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న 1921 మందికి కొత్తగా క‌రోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 22,046 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ స్థాయిలో నిర్ధారణ అయింది. మరోవైపు కొత్తగా 1,210 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

రాష్ట్రవ్యాప్తంగా 88,396 మందికి వ్యాధి సోకింది. వీరిలో 674 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు 64,284 మంది పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంకా 23,438 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో క‌వ‌రీ రేటు 72.72 శాతంగా ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. నిన్న జీహెచ్ఎంసీలో 356,మేడ్చ‌ల్‌ 168, రంగారెడ్డి జిల్లాలో 134 కేసులు అత్య‌ధికంగా న‌మోదు అయ్యాయి.