తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 2,214 మందికి కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 2,214 మందికి కరోనా

October 1, 2020

Corona Cases in Telangana October 1

తెలంగాణ‌లో గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజులో కొత్తగా 2,214 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అదే సమయంలో 2,474 మంది కోలుకున్నారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 54,443 మందికి పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 84.40 శాతానికి చేరింది. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1,93,600 మందికి వైరస్ సోకింది. వారిలో 1,63,407 కోలుకున్నారు 1135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 29,058 మంది వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు 23,0702 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. మిగితా వారు మాత్రమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 30,50444 మంది శాంపిళ్లను పరీక్షించారు. కాగా, నిన్న అత్యధికంగా  జీహెచ్‌ఎంసీ 305, రంగారెడ్డి 191,మల్కాజిగిరి 153, నల్గొండ 149 కేసులు నమోదయ్యాయి.