తెలంగాణలో కరోనా కేసులు.. నిన్న1,432 మందికి పాజిటివ్  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా కేసులు.. నిన్న1,432 మందికి పాజిటివ్ 

October 15, 2020

nvhnfghn

తెలంగాణాలో కరోనా  కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు పెద్దగా రావడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,432 మందికి మాత్రమే కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  38,895 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. వరదలు, భారీ వర్షాల కారణంగా టెస్టుల సంఖ్య తగ్గిపోవడంతో కూడా బాధితుల సంఖ్య తగ్గి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  నిన్న ఒక్క రోజే 1,949 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 

రాష్ట్రంలో మొత్తం 2,17,670 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 1249 మంది మృత్యువాతపడ్డారు.  1,93,218 మంది బాధితులు కోలుకోగా.. ఇంకా 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,084 మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.76% శాతంగా ఉంది.  ఇప్పటి వరకు మొత్తం 37,03,047 మంది శాంపిళ్లను వైద్య సిబ్బంది పరీక్షించారు. మరోవైపు నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 244, మల్కాజిగిరి 115, మిగితా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదు అయ్యాయి.