తెలంగాణలో కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో 42,497 పరీక్షలు చేయగా 1451 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 1983 మంది బాధితులు వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో రికవరీ రేటు 89 శాతానికి చేరింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,20,675కు చేరింది.1,265 మంది మృత్యువాతపడ్డారు. 1,96,636 మంది రోగులు కోలుకోగా.. ఇంకా 22,774 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో దాదాపు 18,905 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మిగితా వారు మాత్రమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 37,89,460 శాంపిళ్లను పరీక్షించారు. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ 235, మల్కాజ్గిరి 101,రంగారెడ్డి 104 కేసులు నమోదు అయ్యాయి.