తెలంగాణలో కరోనా అప్‌డేట్ : 2,123 కేసులు, 9 మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా అప్‌డేట్ : 2,123 కేసులు, 9 మరణాలు 

September 19, 2020

telanga

తెలంగాణా కరోనా కేసులు 2 వేలకు ఏ మాత్రం తక్కువగా నమోదు కావడం లేదు. గ్రామాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే వ్యాధిబారిన పడినవారిని గుర్తిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 2,123 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.  54,459 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే 2,151 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 81.23 శాతానికి చేరింది. 

రాష్ట్రంలో మొత్తం 1,69,169 మందికి వ్యాధి సోకింది. వీరిలో 1025 మంది బాధితులు మరణించారు. 1,37,508 మంది కోలుకున్నారు. 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు   24,34,409 పరీక్షలు చేశారు. నిన్న ఒక్కరోజే అత్యధికంగా జీహెచ్ఎంసీ 305, రంగారెడ్డి 185, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 149, నల్గొండ 135 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నాటి శాంపిళ్లలో ఇంకా , 1207 ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.