తెలంగాణలో 29,873 యాక్టివ్ కేసులు.. నిన్న ఒక్కరోజే 2,278  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 29,873 యాక్టివ్ కేసులు.. నిన్న ఒక్కరోజే 2,278 

September 23, 2020

ngnv b

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజూ 2వేలకు తగ్గకుండా ప్రజలు బాధితులుగా మారుతున్నారు. గడిచిన 24 గంటల్లో 2,278 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒకే రోజు 55,892 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. అదే సమయంలో 2,062  మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 82.52 శాతంగా నమోదు అయింది. 

రాష్ట్రంలో 1,77,070 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో  1,062 మంది చనిపోయారు. 1,46,135  మంది కోలుకోగా.. ఇంకా 29,873 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 23,527 మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటుండటం విశేషం. కాగా ఇప్పటి  వరకు రాష్ట్రంలో 26,28,897 మంది శాంపిళ్లను పరీక్షించారు. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీ 321,రంగారెడ్డి 271, మేడ్చల్‌ 173, నల్గొండ 155, కరీంనగర్‌ 136 కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఆందోళన పడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు.