తెలంగాణ కరోనా అప్‌డేట్ : 2,381 కేసులు 10 మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కరోనా అప్‌డేట్ : 2,381 కేసులు 10 మరణాలు 

September 25, 2020

bvfg

తెలంగాణ కరోనా వ్యాప్తి స్థిరంగా  కొనసాగుతోంది. 2 వేలకు తగ్గకుండా బాధితులను గుర్తిస్తూనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 57,621 పరీక్షలు నిర్వహించగా 2,381 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 10 మంది కొత్తగా వ్యాధి కారణంగా చనిపోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. నిన్న ఒక్క రోజే 2,021 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 82.67 శాతానికి చేరింది. 

రాష్ట్రంలో  మొత్తం 1,81,627 మంది వ్యాధిబారిన పడ్డారు. 1080 మంది బాధితులు చనిపోయారు. 1,50,160 మంది వైరస్‌ను జయించారు. ఇంకా 30,382 మంది వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 24,592 మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన వారు మాత్రమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27,41,836 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఓవైపు బాధితులు, మరోవైపు రికవరీలు సమానంగా నమోదు అవుతున్నాయి. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ 386, రంగా రెడ్డి 227, మేడ్చల్‌లో 193 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.