తెలంగాణ కరోనా అప్ ‌డేట్.. నిన్న2,239 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కరోనా అప్ ‌డేట్.. నిన్న2,239 కేసులు

September 26, 2020

vnbvm

తెలంగాణ కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. నిన్న రాత్రి 8గంటల వరకు గుర్తించిన బాధితుల సంఖ్య 2,239గా పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 11 మంది చనిపోయారు. శుక్రవారం 58,925 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. ఈ స్థాయిలో వ్యాధి నిర్ధారణ జరిగింది. ఒక్కరోజే కొత్తగా 2,181 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 82 శాతానికి చేరింది. 

ఇప్పటి వరకు మొత్తం 1,83,866 మందికి వ్యాధి సోకింది. వీరిలో 1,091 మంది చనిపోయారు. 1,52,441 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. ఇంకా 30,334 మంది చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా 24,683 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,00,761 శాంపిళ్లను వైద్యులు పరీక్షించారు. కాగా, నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 316 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.