తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే

September 29, 2020

jgyj

తెలంగాణలో కరోనా మహమ్మారి దోబూచులాడుతోంది. ఒకరోజు ఎక్కువగా, మరో రోజు తక్కువగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,072 మందికి వైరస్ సోకిందని తేలింది. 9 మరణాలు సంభవించాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం 54,308 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో రోగులను గుర్తించారు. నిన్న ఒక్కరోజే 2,058 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 83.83 శాతానికి చేరింది. 

రాష్ట్రవ్యాప్తంగా 1,89,283 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు 29,40,642 శాంపిళ్లను పరీక్షించారు. 1,116 మరణాలు సంభవించాయి.  1,58,690 మంది వ్యాధిని జయించారు. ఇంకా 29,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 23,934 మంది హోం ఐసోలేషన్లలోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ 283,రంగారెడ్డి 161, మేడ్చల్ 160,నల్లగొండ 139,కరీంనగర్ 109  కేసులు నమోదు అయ్యాయి.