తెలంగాణలో కరోనా అప్ ‌డేట్ : ఇంకా 29,326 యాక్టివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా అప్ ‌డేట్ : ఇంకా 29,326 యాక్టివ్ కేసులు

September 30, 2020

gnb

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో కొంత తక్కువగా బాధితులు బయటపడ్డారు. కానీ గడిచిన 24 గంటల్లో  2,103 మందికి కొత్త వ్యాధి నిర్ధారణ అయింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం 55,359 శాంపిళ్లను పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే  2,243 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 84.08 శాతంగా ఉంది. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,386 మందికి వైరస్ సోకింది. 1,127 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 1,60,933 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 29,326 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 29,96,001 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న అత్యధికంగా  జీహెచ్ఎంసీ 298, మేడ్చల్ 176, రంగారెడ్డి 172,నల్గొండలో 141, కొత్తగూడెం 102, కరీంనగర్ 103 కేసులు నమోదు అయ్యాయి.