Corona cases increased massively in Telangana in last 24 hours
mictv telugu

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

June 21, 2022

తెలంగాణ‌లో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు 26,704 మంది నమూనాలు పరీక్షించగా… కొత్తగా 403 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇవాళ రెట్టింపు కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఒక్కరోజులోనే 400 కి పైగా కేసులు నమోదవడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని, ర‌ద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాల‌ని ఆదేశించింది. ప‌దేండ్ల లోపు పిల్ల‌లు, 60 ఏండ్లు పైబ‌డిన వృద్ధులు అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని సూచించింది. ఇక మిగ‌తా వ‌య‌సు గ‌ల వ్య‌క్తులు.. వివిధ ప‌నుల నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాస్కు ధ‌రించాల‌ని ఆదేశించింది.

మరో వైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకుపైగానే నమోదైన కొత్త కేసులు ఇవాళ 10వేల దిగువకు చేరాయి.. పలు రాష్ట్రాల్లో వైరస్‌ విస్తరిస్తుండటంతో యాక్టివ్ కేసులు 79 వేలపైకి ఎగబాకాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.