దేశంలో కరోనా అప్‌డేట్.. నిన్న ఒక్కరోజే.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో కరోనా అప్‌డేట్.. నిన్న ఒక్కరోజే..

October 24, 2020

carona01

భారత్‌లో కరోనా కేసులు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉంటోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 53,370 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.  650 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 12,69,479 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 67,549 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు.  

దేశవ్యాప్తంగా మొత్తం 78,14,682 పాజిటివ్ కేసులు మోదు అయ్యాయి. మరణాల సంఖ్య 1,17,956కు చేరింది.  70,16,046 మంది రోగులు కొలుకున్నారు. ఇంకా 6,80,680 యాక్టివ్ కేసులు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. వీరిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇప్పటి వరకు దేశంలో 10,13,82,564 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. రికవరీ రేటు 89.78 శాతంగా ఉంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 42,489,905 పాజిటివ్ కేసులు గుర్తించారు.1,149,229 మరణాలు సంభవించాయి. 31,427,020 రికవరీలు నమోదు కాగా, 9,913,656 యాక్టివ్ కేసులు ఉన్నాయి.