దేశంలో కరోనా కల్లోలం.. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో కరోనా కల్లోలం.. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు 

September 19, 2020

gngcn

కరోనా మహమ్మారి దేశంలోకి వచ్చి 232 రోజులకు చేరింది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రోజు రోజుకు తీవ్రత పెరుగుతూనే వచ్చింది. తాజాగా గడిచిన 24 గంటల్లోనూ కొత్త 93,337 మందికి వైరస్ లక్షణాలను గుర్తించారు. 1247 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజులోనే ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు. నిన్న 95,880 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. శుక్రవారం 8,81,911 పరీక్షలు చేయగా.. మహారాష్ట్రలోనే అత్యధికంగా 21,656 మంది వ్యాధిబారిన పడ్డారు.

దేశంలో ఇప్పటి వరకు మొత్తం 53,08,015 మందికి వైరస్ సోకింది. 42,08,432 మంది కోలుకోగా.. ఇంకా 10,13,964 మంది బాధితులు చికిత్స తీసుకుంటూ ఉన్నారు. 85,619 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 78.86 శాతానికి చేరింది. మొత్తం 6,24,54,254 మంది శాంపిళ్లను పరీక్షించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 30,697,734 మందికి వ్యాధి సోకింది. వీరిలో 9,56,446 మంది రోగులు చనిపోయారు. 22,339,889 మంది కోలుకోగా.. ఇంకా 74,01,399 యాక్టివ్ కేసులు ఉన్నాయి.