దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం (నిన్న) ఒక్కరోజే 2,380 కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోం క్వారంటైన్లలో 13,433 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
అంతేకాకుండా కరోనా నుంచి బుధవారం 1,231 మంది కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 4,25,14,479గా ఉందని పేర్కొంది. కరోనాతో పోరాడి 56 మంది మృతి చెందారని తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 5,22,062కి పెరిగిందని వెల్లడించింది. కావున ప్రజలు తమ ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది.
మరోపక్క కరోనా విజృంభిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఫోర్త్ వేవ్ రానున్నట్లు పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ వరకు కరోనా కేసులు భారీగా పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తగా ఉండాలని కోరుతున్నారు.