భారత్‌లో తగ్గిన కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే? - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో తగ్గిన కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?

July 3, 2022

భారతదేశంలో గతకొన్ని రోజులుగా 18వేలకుపైగా నమోదు అవుతున్న కరోనా కొత్త కేసులు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,103 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త కేసులకు సంబంధించి ఆదివారం రోజు బులెటెన్ విడుదల చేశారు.

విడుదలైన బులెటెన్ వివరాల ప్రకారం.. ”తాజాగా, 16,103 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,35,02,429కి చేరాయి. ఇందులో 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,199 మంది మృతిచెందారు. మరో 1,11,711 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 31 మంది కరోనాతో మృతి చెందారు. మరో 13,929 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.”

ఇక, రోజువారి యాక్టివ్ కేసుల విషయానికొస్తే.. మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉంది. ఇప్పటివరకు 197.95 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.