తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న1,708 - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న1,708

October 13, 2020

nvhnvhn

తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుతూ కాస్త ఊరటను కలిగిస్తోంది. గడిచిన రెండు రోజులుగా స్వల్పంగానే బాధితులు బయటపడుతున్నారు. గడిచిన 1,708 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 46,835 మందికి పరీక్షలు చేయగా.. ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. నిన్న ఒక్క రోజే 2,009 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 88.15 శాతానికి చేరింది. 

రాష్ట్రంలో మొత్తం 2,14,792 మందికి వ్యాధి సోకింది. వీరిలో 1233 మంది మృత్యువాతపడ్డారు. 1,89,351 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా 24,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,748 మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 36,24,096  శాంపిళ్లను పరీక్షించారు. కాగా, నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ 277 ,రంగారెడ్డి 137,మల్కాజ్‌గిరి 124, అత్యల్పంగా అసిఫాబాద్‌ 8 కేసులు నమోదయ్యాయి.