కరోనా అప్‌డేట్..  7,42,417 మందికి పాజిటివ్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా అప్‌డేట్..  7,42,417 మందికి పాజిటివ్ 

July 8, 2020

 

vn vb mvh

దేశంలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. రోజులు గడిచే కొద్ది రికార్డు స్థాయిలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎన్ని విధాలుగా కట్టడి చేసినా ఫలితం ఉండటం లేదు. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 22,752 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు.  482 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 7,42,417 మంది కరోనా బారిన పడ్డారు. 20,642 మంది వైరస్ కాటుకు బలి అయ్యారు. ఇప్పటి వరకు 4,56,830 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2,64,944  మంది చికిత్స పొందుతున్నారు. 

ఇప్పటి వరకూ కూడా నాలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కేసులు పెరిగాయి. ఈ రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా 2,17,121 పాజిటివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడు 1,18,594 రోగులతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 1,02,831, గుజరాత్ 36,858 మందికి వైరస్ సోకింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,19,24,855 మంది వ్యాధి బారిన పడ్డారు. 5,45,332 మంది చనిపోయారు.