కరోనా.. కేసీఆర్ నగదు పురస్కారాలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

 కరోనా.. కేసీఆర్ నగదు పురస్కారాలు ఇవే

April 7, 2020

Corona .. CM KCR cash awards are the GO Orders

నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ‘వన్ టైమ్ చీఫ్ మినిస్టర్ స్పెషల్ ఇన్సెంటివ్’ కింద నగదు ప్రోత్సహకాలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి నిరంతరం పాటుపడుతున్న వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది సహా పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నగదు పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే.

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోని పారిశుద్ధ్య సిబ్బందికి, గ్రామ పంచాయతీలలోని మల్టీ పర్పస్ వర్కర్లకు, వాటర్ సప్లై లైన్‌మెన్, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీకు చెందిన మురుగునీటి కార్మికులకు ఈ ఇన్సెంటివ్‌లు అందిస్తున్నట్టు జీవోలో స్పష్టంచేశారు. మార్చి నెలలో తమ విధులకు హాజరైన ఉద్యోగులకు మాత్రమే ఈ ఇన్సెంటివ్‌‌లు ఇవ్వనున్నారు. ఆ నెలలో సెలవుల్లో ఉన్నవారికి, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయినవారికి, సస్పెన్షన్‌లో ఉన్నవారికి ఇవ్వడం జరగదని జీవోలో పేర్కొన్నారు.

నగదు పురస్కారాలు ఇలా అందనున్నాయి..

-వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి, వారి గ్రాస్ శాలరీల్లో 10 శాతం  

-హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీకు చెందిన రెగ్యులర్ వాటర్ సప్లై లైన్‌మెన్, మురుగు కాల్వల కార్మికులకు రూ.7,500 

-గ్రామ పంచాయతీలలోని రెగ్యులర్, ఔట్ సోర్సింగ్‌కు చెందిన పారిశుద్ధ్య-మల్టీ పర్పస్ కార్మికులకు రూ.5000 

-జీహెచ్ఎంసీకి చెందిన రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగులు/ సిబ్బందికి రూ.7500 

-జీహెచ్ఎంసీ కాకుండా అన్నీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోని రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు/ సిబ్బందికి రూ.5,000