తెలంగాణలో కరోనా డబుల్ సెంచరీ.. నేడు 206 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా డబుల్ సెంచరీ.. నేడు 206 కేసులు

June 6, 2020

206 Positive.

తెలంగాణలో కరోనా రోజురోజుకు రెచ్చిపోవడం కలకలం రేపుతోంది. నేడు కొత్తగా 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ 10 మంది మృతిచెందగా మృతుల సంఖ్య 123కు చేరింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 152 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, యాదాద్రిలో 5, మహబూబ్ నగర్ 4, మహబూబాబాద్ 1, జగిత్యాల 2, వికారాబాద్ 1, జనగాం 1, నాగర్ కర్నూల్ 2, గద్వాల్ 1, నల్గొండ 1, భద్రాద్రి 1, కరీంనగర్ 1, మంచిర్యాల 1గా కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,496కు చేరింది. ఈరోజు 83 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,710కి చేరింది. ప్రస్తుతం 1,643 యాక్టివ్ కేసులు ఉన్నాయి.