చీపురుతోనూ కరోనా వస్తుందట! - MicTv.in - Telugu News
mictv telugu

చీపురుతోనూ కరోనా వస్తుందట!

September 23, 2020

nbgvbn

కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటి వరకు నోటి తుంపర్లు, చేతులు కలపడం ద్వారా సోకుతుందని తేల్చారు. గాలి ద్వార కూడా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ క్రమంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది.  ఇంట్లో ఉండే చీపురు కారణంగా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని తేలింది. ఢిల్లీ ఎయిమ్స్‌ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అనురాగ్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. చీపురు వాడినప్పుడు  నేలపై ఉండే దుమ్ము కణాల ద్వారా అది గాల్లోకి లేచి మనిషికి సోకే ప్రమాదం ఉందన్నారు. 

ఇంటిని ఊడ్చే సమయంలో కరోనా వైరస్ నేలపై ఉంటే అది దాని ద్వారా గాల్లోకి లేచే అవకాశం ఉందన్నారు. అప్పుడు అది దుమ్ముతో పాటు నేరుగా ముక్కులోకి వెళితే వ్యాధి సోకడం ఖాయమని చెప్పారు. వాస్తవానికి కరోనా వైరస్ ఘన పదార్థాలపై 3 నుంచి 5 రోజుల వరకు బతికే అవకాశం ఉంది. ఈ సమయంలో ఊడ్చినప్పుడు చీపురు కూడా వాహకంగా పని చేస్తుందని తెలిపారు. చీపురు బదులు వాక్యూమ్ క్లీనర్ వాడటం ఉతమం అని సూచించారు. కాగా మన దేశంలో వ్యాక్యూమ్ క్లీనర్ వాడే స్థాయి ప్రజల్లో చాలా వరకు లేదు. అన్ని ఇళ్లలోనూ చీపుర్లనే వాడుతున్నా వాటి ద్వారా వైరస్ బారిన పడిన వారి సంఖ్య లేకపోవడం విశేషం.