అమెరికాలో కరోనా కల్లోలం.. 3.38 లక్షల మంది చిన్నారులకు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో కరోనా కల్లోలం.. 3.38 లక్షల మంది చిన్నారులకు..

August 10, 2020

Corona Effect in America Children's .

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వెంటాడుతూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడ ప్రజల వైరస్‌తో అల్లాడిపోతున్నారు. పిల్లల్లో కూడా ఎక్కువ మంది వ్యాధి బారిన పడ్డారని తాజా అధ్యాయనంలో తేలింది. ఇప్పటి వరకు అక్కడ 3.38 లక్షల మంది చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో కేవలం రెండు వారాల్లోనే 97 వేల మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వెల్లడించింది. దీంతో చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

వైరస్ వ్యాప్తి అలాగే ఉండగానే స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్నారులకు కరోనా సోకడం కలవరపెడుతోంది. దీంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. కాగా ఇప్పటి వరకు అక్కడ సుమారు 50 లక్షలకు పైగా కరోనా కేసులు ఉండగా.. వీరిలో 3.38 లక్షల మంది పిల్లలే ఉండటం విశేషం. దీంతో చిన్నారులకు టెస్టుల సంఖ్యను పెంచే యోచనలో అధికారులు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడే పాఠశాలలు తెరవకూడదని అభిప్రాయపడుతున్నారు.