కరోనా ప్రభావం.. స్థానిక సంస్థల నిధులు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ప్రభావం.. స్థానిక సంస్థల నిధులు విడుదల

March 21, 2020

Nirmala Sitharaman

దేశంపై కరోనా పంజా విసురుతుండగా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రాలకు కేంద్రం స్థానిక సంస్థల నిధులను విడుదల చేసింది. పారిశుద్ధ్య పనుల కోసం కేంద్రం ముందుగానే నిధులు విడుదల చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల పట్టణ, గ్రామీణ సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. పారిశుద్ధ్య పనుల కోసం ముందుగానే ఈ నిధులను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా ఆరు రాష్ట్రాలకు కలిపి రూ.2,570 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఏపీకి 2018-19 ఏడాదికి గానూ రెండో విడత నిధుల కింద రూ.870.23 కోట్లు, 2019-20 ఏడాదికి మొదటి విడత నిధుల కింద రూ.431 కోట్లు విడుదల చేసింది. 

కాగా, స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాలంటూ ఏపీ సహా అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికలతో నిధుల విడుదలను ముడివేసిన కేంద్రం నాన్చుతూ వచ్చింది. అయితే కరోనా ప్రభావంతో కేంద్ర సర్కార్‌కు స్థానిక సంస్థల నిధులు విడుదల చేయక తప్పలేదు.