సగం మంది ప్యాంట్లు వేసుకోవడం లేదు..
ఎప్పుడు చూసినా అవే నైటీల్లో ఉంటారు అని ఇన్ని రోజులు ఆడవాళ్ల మీద పడి ఏడ్చి, జోకులు పేల్చిన మగవాళ్లు కూడా ఇప్పడు వారి బాటే పట్టారు. తమ దాకా వస్తే తెలియదని ఇందుకే అంటారేమో. లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు ఇంటినుంచే (వర్క్ ఫ్రం హోం)పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీసుకు వెళ్లాలంటే నిత్యం ఇస్త్రీ చేసిన ఫార్మల్ డ్రస్, టై, షూలు, నీట్ షేవింగ్, పర్‌ఫ్యూమ్ కొట్టుకుని వెళ్లేవారు. ఇప్పుడు ఇళ్లల్లో పని చేస్తుడటంతో ఆ ఆర్భాటాలన్నింటినీ మగ పుంగవులు విడిచిపెట్టాశారని ఓ సర్వే తేల్చింది. ఒంటిమీద లైటర్ వేలో ఉన్న బట్టలు వేసుకుంటున్నారు. పైజమాలు, షార్టులు, బాక్సర్లు వేసుకుని పని చేసుకుంటున్నారు. యూగొవ్ (YouGov) అనే సంస్థ ఈ సర్వే చేసింది. ఆ సర్వేలో అనేక షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది.
47శాతం మంది అమెరికన్లు కాళ్లకు బట్టలు వేసుకోకుండానే పనులు చేసుకుంటున్నారట. (ప్యాంట్లు, స్కర్టులు, షార్టులు)లాంటివి వేసుకోకుండానే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. వారిలో 39శాతం మంది ఫ్యాన్సీ బట్టలు వేసుకుని నడుం వరకు మాత్రమే వేసుకుంటున్నారు. మహిళలు కూడా మూడు రెట్లు ఇలాంటి పనే చేస్తున్నారు. ఆఫీస్ మీటింగ్స్ కోసం వీడియో కాల్స్ చేసుకోవడానికి కెమెరా ముందుకు వచ్చినప్పుడే తల దువ్వుకుని, పౌడర్ రాసుకుని, ఫార్మల్ బట్టలు వేసుకుంటున్నారట. వీడియో మొదలవడానికి ముందే 54శాతం మంది తల దువ్వుకోవడం, బ్రష్ చేసుకోవడానికి ముందే ఇలా తంటాలు పడుతున్నారు. వీరిలో 70శాతం మంది మగాళ్లు ఉంటే మహిళల్లో 40శాతం మంది ఉన్నారు. కెమెరా ముందుకు వచ్చేటప్పుడు ముఖం కడుక్కునేవారు (51శాతం), పళ్లు తోముకునేవారు (50 శాతం), షేవింగ్ చేసుకునేవారు(24 శాతం), మేకప్ వేసుకునేవారు (19 శాతం), కంఫర్టబుల్‌గా చేసుకుని కూర్చునేవారు(29 శాతం) ఉన్నారట.