50 మంది సెలబ్రెటీలకు కరోనా.. బర్త్ డే వేడుక వల్లే.. - MicTv.in - Telugu News
mictv telugu

50 మంది సెలబ్రెటీలకు కరోనా.. బర్త్ డే వేడుక వల్లే..

June 6, 2022

ఇండియాలో గతకొన్ని రోజులుగా కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ సినీ పరిశ్రమపై కరోనా పంజా విసురుతోంది. బాలీవుడ్‌లో తాజాగా 50 మంది సెలబ్రెటీలకు కరోనా సోకినట్లు సమాచారం. ఇందులో స్టార్ హీరోలు, హీరోయిన్లు, ఆర్టీస్టులు ఉన్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, షారుఖ్ ఖాన్ హీరోలు, హీరోయిన్స్ కరోనా బారిన పడ్డారు. కొంతమంది స్టార్లు తమకి కరోనా సోకిన విషయాన్ని బయటికి ప్రకటించటం లేదు. సైలెంట్‌గా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

ఇక, ముంబైలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుండంతో షూటింగ్స్‌లు, ఈవెంట్‌లు ఆగిపోయాయి. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కరోనా బారిన పడడంతో ఆయన తాజాగా నటిస్తోన్న సినిమా షూటింగ్‌ను చిత్రబృందం వాయిదా వేశారు. చాలా మంది తారలు కరోనా బారిన పడి హూం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. ఇదంతా కరణ్ జోహార్ పార్టీ వల్లే కరోనా వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో మే 25న కరణ్ జోహార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా వచ్చారు. ఆ పార్టీలోనే కరోనా వ్యాప్తి చెందిదని టాక్ వినిపిస్తుంది. పార్టీకి హాజరైన వారిలో దాదాపు 50 మందికి పైగానే కరోనా సోకి ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు పలు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అవన్నీ ఉట్టి పుకార్లు తప్ప, ఎవరికీ కరోనా సోకలేదు అని ఒక నివేదికను సినీ వర్గాలు వెల్లడించాయి.