కరోనా భారత్ @606.. 12 మరణాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భారత్ @606.. 12 మరణాలు.. 

March 25, 2020

Corona fresh statistics

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జనం గుమికూడకుండా తీసుకుంటున్న లాక్ డౌన్ చర్యలు ఫలితాలిస్తున్నా.. ఇప్పటికే వైరస్ సోకిన వారిని సరిగ్గా గుర్తించకపోవడంతో కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈరోజు(బుధవారం) సాయంత్రం నాటికి దేశంలో 606 కేసులు నమోదయ్యాయి. వీరిలో 43 మంది విదేశీయులు ఉన్నారు. ఇక మరణాల సంఖ్య 12కు చేరింది. కేరళలో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారు. తెలంగాణ, ఏపీల్లో కొత్త కేసులు నమోదైనట్లు వార్తలేవీ రావడంలేదు. మంగళవారం నాటికి తెలంగాణలో 39, ఏపీలో 7 కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 110 ఉన్నాయి. రాజస్తాన్‌లో 40 కేసులు నమోదుకాగా ఒక్క భిల్వారాలోనే 16 మంది వైరస్ బారిన పడ్డారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేసుల సంఖ్య 3.8 లక్షలుగా ఉంది. మరణాల సంఖ్య 19753 కాగా, 1.12 లక్షమంది కోలుకున్నారు. ఇటలీ, స్పెయిన్‌లలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రెండు దేశాల్లో నిన్న ఒక్కరోజే 700 మందికిపైగా చనిపోయారు. 6000 పైచిలుకు మరణాలతో ఇటలీ అగ్రస్థానంలో ఉండగా 3700 మరణాలతో స్పెయిన్ రెండో స్థానంలో కొనసాగుతోంది.