ఆఫ్రికన్ వాసులు హెయిర్ స్టైల్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. రకరకాల అలంకరణతో విభిన్నంగా కనిపిస్తారు. ఏ విషయం ట్రెండ్‌లో ఉంటే దానికి తగ్గట్టుగా తమ కేశాలను మలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచంపై కరోనా పంజా విసరడంతో ఇదే ఇప్పుడక్కడ ట్రైండ్‌గా మారిపోయింది. ఎవర్ని చూసినా కరోనాను తలపించే హెయిర్ స్టైల్‌తో దర్శనం ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
కరోనా ఆకృతిలో జట్టుకును కొమ్ములుగా తయారు చేసుకొని కనిపిస్తున్నారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా అందరూ దీన్నే ఫాలో అవుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిహెయిర్ స్టైల్ వెనక ఓ బలమైన కారణం కూడా ఉందని ఆఫ్రికన్స్ చెబుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఈ వైరస్ ఎంత భయంకరమైనదో ప్రజలు సులువుగా అర్థం చేసుకుంటారని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికన్‌వాసులు ఇలా కేశాలంకరణకుప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తిగా మారింది.