కర్నూలులో కరోనా గుర్రం.. రౌండ్లేసిన ఏనుగులు  - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలులో కరోనా గుర్రం.. రౌండ్లేసిన ఏనుగులు 

March 31, 2020

Corona horse in Kurnool 

కరోనా లాక్‌డౌన్‌తో దేశంలో కొన్నిచోట్ల చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. టిక్‌టాక్‌లో క్రియేటివిటీకి అంతే లేదు. మరోపక్క.. మనుషులకొచ్చిన ఈ మాయదారి రోగం జంతువులకు నవ్వు పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వన్యమృగాలు మహానగరాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. జంతువులంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది కనుక కర్నూలులో ఓ ఎస్ఐకి వింత ఆలోచన తట్టింది. 

తెల్లగా మెరిసిపోతున్న గుర్రానికి కరోనా వైరస్ ముద్రలు అచ్చేసి రోడ్డుపైన తిప్పేస్తున్నాడు. వైరస్ గురించి తెలియని వారికి కూడా అలా అవగాహన కల్పిస్తున్నాడు. ప్యాపిలి ఎస్‌ఐ మారుతీ శంకర్‌ కరోనా గుర్రంపై తిరుగుతుంటే జనం నవ్వుతూ.. ఇళ్లలోకి పరిగెడుతున్నారు.

 

ఇక కేరళలోని వయనాడ్‌లో ఓ ఏనుగు లాక్ డౌన్ పాలైన ఊరిలో షికార్లు కొడుతూ వెళ్లిపోయింది. హరిద్వార్‌లో మరో ఏనుగు భయపెట్టింది. కార్ల అద్దాలపై పిచుకలు గుడ్లు పెట్టడం, బైకుల్లో పాములు కాపురం పెట్టడం.. చెప్పడానికి ఇలాంటివెన్నో ఉన్నాయిలెండి. 

Corona horse in Kurnool