ఏపీ మంత్రి ఇంట్లో కరోనా కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ మంత్రి ఇంట్లో కరోనా కలకలం

June 1, 2020

 

AP Ministers.

ఏపీ అధికార పార్టీ నేతలను కరోనా భయం వెంటాడుతోంది. వారి కుటుంబాల్లో వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తం ఇవుతున్నారు. గతంలో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులకు పాజిటివ్ అని తేలింది. తాజాగా మంత్రి ఇంట్లో కూడా లక్షణాలు బయటపడ్డాయి. మంత్రి శంకర్‌ నారాయణ నివాసంలో ముగ్గురు కరోనా బారినపడ్డారు. దీంతో వెంటనే మంత్రికి పరీక్షలు చేయగా ఆయనకు నెగిటివ్‌ వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా అందరిని క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. 

మంత్రి శంకర్‌ నారాయణ మేనత్త కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శనివారం చనిపోయారు. అయితే అంతా ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయిందని అనుకున్నారు. కానీ తీరా పరీక్షలు చేయగా కరోనా అని తేలింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా ముగ్గురికి సోకిందని తేలింది. దీంతో ఆమె నివాసం ఉంటున్న ధర్మవరంలోని సాయినగర్‌ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య సిబ్బంది శానిటైజ్‌ చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.