తెలంగాణలో కరోనా వీరంగం.. ఒక్కరోజే 169 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా వీరంగం.. ఒక్కరోజే 169 కేసులు

May 29, 2020

 

169

తెలంగాణ రాష్టంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న 117 కేసులు నమోదవగా ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా నేడు కేసులు మరిన్ని పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా నేడు 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో నలుగురు మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 71కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 82 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు, మెదక్ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఇక వలసకూలీల్లో ఐదుగురికి, విదేశాల నుంచి వచ్చినవారిలో 64 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1381కి చేరగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1908కిి చేరింది. 

ప్రస్తుతం 973 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. నాలుగు రోజుల క్రితం పిల్లాడికి జ్వరం రావడంతో మెదక్‌‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు హైదరాబాద్‌కు పంపించగా, అక్కడ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ బాబును గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, కొడపాక గ్రామాన్ని పోలీసులు, అధికారులు సందర్శించారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులతో ఎవరెవరు కలిశారో ఆరా తీస్తున్నారు.