Home > Corona Updates > దేశంలో కరోనా విలయం.. 4 వేలు దాటిన మరణాలు

దేశంలో కరోనా విలయం.. 4 వేలు దాటిన మరణాలు

hnn

కంటికి కనిపించని కరోనా భారత్‌లో రోజుకో రికార్డు సృష్టిస్తూనే ఉంది. తన వ్యాప్తిని పెంచుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో నిన్న దేశంలో 6500కిపైగా కొత్త కేసులు నమోదు అయ్యాయని వెల్లడించింది. 146 మంది మరణించారు. తాజా లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1.45 లక్షల మందికి వ్యాధి సోకింది. దీంతో మరణాల సంఖ్య 4167 కు చేరింది.

తాజా కేసులతో భారత్ ప్రపంచంలో వైరస్ వ్యాప్తిలో 10వ స్థానానికి చేరింది. ఇరాన్‌లో లక్షా 35 వేల కేసులు ఉండగా.. భారత్‌లో 1.45 లక్షల కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ దేశాన్ని భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం 80 వేేలకుపైగా యాక్టివ్ కేసులు ఉండగా.. రికవరీ రేటు 42.6 శాతానికి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోంది. అక్కడ కేసుల సంఖ్య 52,667కు చేరింది. నిన్న ఒక్కరోజే 2436 కేసులు నమోదయ్యాయి. 1695 మంది వైరస్‌కు బలి అయ్యారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 55.86 లక్షల మంది ఇన్ఫెక్షన్ బారిన పడగా.. 3.47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన అలాగే కొనసాగుతోంది. దీనికి తోడు లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.

Updated : 25 May 2020 10:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top