కరోనా వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.. ఊరికి ఊరే క్వారంటైన్! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.. ఊరికి ఊరే క్వారంటైన్!

June 29, 2020

Yadadri District.

కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి జిల్లాలకు పాకి అక్కడి ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. పెళ్లిళ్లకు, చావులకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో ఒక్కసారిగా కలకలం రేగింది. యాదాద్రి జిల్లా బొమ్మల రామారారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి అంత్యక్రియల్లో ఊరు ఊరంతా పాల్గొన్నారు. 

తర్వాత చనిపోయిన వ్యక్తికి కరోనా సోకిందని అధికారులు దృవీకరించారు. మృతుడికి కరోనా ఉందన్న విషయం తెలియని గ్రామస్తులు అతడి అంత్యక్రియలకు హాజరయ్యారు. సుమారుగా 500 మంది అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. అతనికి కరోనా అని తెలియడంతో గ్రామస్థుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వారంతా భయంతో వణికిపోతున్నారు. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో దాదాపుగా గ్రామం మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయింది.