Corona new cases exceeding 17 thousand in India: Center
mictv telugu

భారత్‌లో 17వేలు దాటిన కరోనా కొత్త కేసులు: కేంద్రం

June 27, 2022

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. కొత్తగా 17,073 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు కాసేపటి క్రితమే బులెటెన్ విడుదల చేశారు. విడుదల చేసిన బులెటెన్ వివరాల ప్రకారం..”ఆదివారం 11 వేల కరోనా కేసులు వచ్చాయి. కొత్తగా మరో 17,073 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోలిస్తే, 45 శాతం అధికం అయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,07,046కి చేరాయి. 4,27,87,606 మంది డిశ్చార్జీ అయ్యారు. 94,420 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,25,020 మంది మృతి చెందారు.”

మరోపక్క ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 21 మంది కరోనా సోకి మృతిచెందగా, 15,208 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నిన్న 2,49,646 మంది వ్యాక్సినేషన్‌ తీసుకున్నారని, ఇప్పటివరకూ మొత్తం 197.11 కోట్ల మంది టీకా తీసుకున్నట్లు వివరాలను వెల్లడించారు. ఇక, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.21 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.57 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతానికి పెరిగింది.