దేశంలో 50 వేలకు చేరువలో కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 50 వేలకు చేరువలో కరోనా కేసులు

May 6, 2020

Corona New Positive Cases in World 

దేశంలో కరోనా కేసులు 50 వేల మార్కును చేరేందుకు వేగంగా పరుగులు పెడుతోంది.లాక్‌డౌన్ విధించినా.. ప్రజలను అప్రమత్తం చేసినా కేసుల పెరుగుదలో మాత్రం మార్పు రావడం లేదు. తాజా లెక్కల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 14,183 మంది వైరస్ బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో యాక్టీవ్ కేసులు సంఖ్య 33514గా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మహమ్మారికి 1694 మంది బలి అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 15,525 కేసులు ఉండగా, 617 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 6,245, ఢిల్లీలో 5,104, తమిళనాడులో 4,058, రాజస్తాన్‌లో 3,158, మధ్యప్రదేశ్‌లో 3,049 వరకు కేసులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కట్టడి అవుతోంది. 

తెలంగాణలో మరో గడిచిన 24 గంటల్లో 11 కరోనా కేసుల కొత్తగా నమోదు అయ్యాయి. దీంతో వీటి సంఖ్య 1096కు పెరిగింది. 43 మంది డిశ్చార్జ్ కావడంతో ఈ సంఖ్య ప్రస్తుతం 628కు చేరింది. దీంతో 439 మంది ఇంకా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపుప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య 35లక్షలు దాటింది. 2.50 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో 11,80,332 పాజిటివ్ కేసులు ఉండగా 68,920 మంది మరణించారు. దీంతో ఈ మహమ్మారికి ఇంకా ఎంత మంది బలి అవుతారోనని ప్రపంచ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి.