దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులను బట్టిచూస్తే త్వరలోనే ఫోర్త్ వేవ్ రానుందని, అది కూడా జూన్ మాసంలోనే ప్రారంభమవుతుందని ఇటీవలే అధికారులు వెల్లడించారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,545 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
‘దేశవ్యాప్తంగా గురువారం 3,545 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించారు. ఇంకా 19,688 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాకు బలయ్యారు. 3,549 మంది డిశ్చార్జీ అయ్యారు” అని ఆరోగ్యశాఖ అధికారులు వివరాలను వెల్లడించారు.
కొత్తగా ఢిల్లీలో 1,365 కేసులు (38.5 శాతం), హర్యానాలో 534, ఉత్తరప్రదేశ్లో 356, కేరళ 342, మహారాష్ట్రలో 233 కేసులు నిర్ధారణ అయ్యాయని అధికారులు చెప్పారు. ఇక ఇప్పటివరకు 1,89,81,52,695 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో 16,59,843 మందికి గురువారం వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే 4,23,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు.