కరోనా రోగులు వెళ్తున్న అంబులెన్స్ బోల్తా.. 12 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా రోగులు వెళ్తున్న అంబులెన్స్ బోల్తా.. 12 మందికి గాయాలు

July 7, 2020

vb gcv n

కరోనా రోగులతో ఆస్పత్రికి వెళ్తున్న అంబులెన్సు మార్గ మధ్యలోనే ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి బోల్తా పడటంతో 12 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలో ఈ ఊహించని ఘటన జరిగింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయకచర్యలు అందించారు. ఈ సంఘటన అక్కడ ఉండే వారు భయాందోళనకు గురయ్యారు. ఓ వైపు కరోనా రోగులు, మరోవైపు వ్యాను నడిరోడ్డుపై బోల్తా పడటంతో కలకలం రేపింది. బాధితులంతా కొత్రూడ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో ఆస్పత్రులు అన్ని నిండిపోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కొంత మందిని మరో ఆస్పత్రికి తరలించేందుకు వైద్యాధికారులు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. 12 మంది రోగులతో వెళ్తున్న ఓ అంబులెన్సు పుణె – ముంబై ప్రధాన రహదారిపై బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న వారందరికి  తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అధికారులు క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.