గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి హల్‌చల్ - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి హల్‌చల్

May 12, 2020

Corona Patient in Gandhi Hospital

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ కొంతసేపు సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించాడు. తనను వెంటనే డిశ్చార్జీ చేయాలంటూ డిమాండ్ చేశాడు. తనను బయటకు పంపుతామని హామీ ఇచ్చే వరకు భోజనం చేయనంటూ భీషించుకొని కూర్చున్నాడు. ఉన్నతాధికారులు కల్పించుకొని అతన్ని సముదాయించడంతో అతడు వెనక్కి తగ్గాడు. కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా రోగులను ఆస్పత్రిలో ఉంచుతున్నామని నెగిటివ్ రాగానే ఇంటికి పంపిస్తామని స్పష్టం చేశారు. 

సూర్యాపేటకు చెందిన వ్యక్తి నెల రోజుల క్రితం కరోనా అనుమానాలతో గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించగా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం వచ్చిన వారిని డిశ్చార్జి చేస్తున్నా తనను ఎందుకు చేయడం లేదని గొడవకు దిగాడు. అయితే అతనికి 15 రోజుల తర్వాత కూడా పాజిటివ్ రావడంతోనే ఇలా చేయాల్సి వస్తోందని వివరించారు. కేంద్రం నిబంధనల ప్రకారం కూడా ఐసోలేషన్‌లో ఉన్న రోగికి 14 రోజుల తర్వాత పరీక్షల్లో నెగిటివ్ రావాలి. ఆ తర్వాత 24 గంటల్లో మరోసారి పరీక్షలు జరిపినా నెగిటివ్ వస్తేనే ఇంటికి పంపించే అవకాశం ఉంది.